
కమాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్‌గౌడ
● ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్‌గౌడ
కమాన్‌పూర్/రామగిరి/పాలకుర్తి: కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్‌గౌడ సందర్శించారు. వందశాతం పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఆదివరహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తహసీల్దార్ మోహన్‌రెడ్డి, గోదావరిఖని టూటౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సై రాములు, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో శేషయ్య ఉన్నారు. అనంతరం రామగిరి మండలంలోని ఆయా పోలింగ్ కేంద్రాలను శ్రీధర్‌గౌడ్ పరిశీలించారు. వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాంచందర్‌రావు, ఎస్సై రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకుర్తి మండలం కన్నాల, రాణాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకుడు సీఎన్ శ్రీధర్‌గౌడ పరిశీలించారు. కేంద్రాల్లో సౌకర్యాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోతి, పెద్దపల్లి సీఐ అనిల్‌కుమార్, బసంత్‌నగర్ ఎస్సై వెంకటేశ్ తదితరులు ఉన్నారు.