సీతంపేట: సీతంపేట మండలంలో వైఎస్సార్‌సీ పీ విజయదుందుభి మోగించింది. ఓటర్లకు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటరు నాడి చెక్కు చెదరకుండా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కుండంగి సరస్వతిని గెలిపించుకున్నారు. జనసేన అభ్యర్థి ఇమరక పవన్ పై 2119 ఓట్ల మెజా ర్టీతో గెలుపొందారు. 33,211 ఓట్లకుగాను 29,507 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్‌సీపీకి 15,813, జనసేనకు 13,694, చెల్లని ఓట్లు 2097, నోటాకు 994 వచ్చాయి. ఐదు రౌండ్లకుగా ను మొదటి రౌండ్లో 652 మెజార్టీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చాయి. రెండో రౌండ్‌లో 709, ఽమూడో రౌండ్‌లో 590, నాల్గో రౌండ్లో 109, ఐదో రౌండ్‌లో 37, పోస్టల్ బ్యాలెట్‌లో 22 ఓట్ల మెజార్టీ సాధించా రు. ఏ రౌండ్‌లోను మెజార్టీ తగ్గకుండా గెలుపొందారు. ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


