సాలూరు: తుండ, పెదబోరబంద ఎంపీటీసీలుగా గెలిచిన రెడ్డి పద్మావతి, ఉమామహేశ్వరి గోర్జలు అక్కాచెల్లెళ్లు. వైఎస్సార్‌సీపీ సాలూరు జెడ్పీటీసీగా దండి అనంతకుమారి గెలిచారు. భర్త దండి శ్రీనివాసరావు మరిపల్లి ఎంపీటీసీగా గెలుపొందారు. విజేతలుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం అభినందించారు.
విజయనగరం అర్బన్/కొత్తవలస: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాజ్యపురస్కార్ సర్టిఫికెట్లను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు. అమరావతిలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కీడాంకు చెందిన స్కౌట్ విద్యార్థి బండారు చరణ్, కొత్తవలస జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గైడ్ విద్యార్థిని ఎల్.ధనలక్ష్మి జిల్లా ప్రతినిధులుగా పాల్గొన్నారు. సంస్థ సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్న రిటైర్డ్ గ్రేడ్–2 హెచ్‌ఎం సీహెచ్ నారాయణమూర్తికి గవర్నర్ ప్రశంసాపత్రం, షీల్డ్ అందజేశారు. విద్యార్థులు నాలుగేళ్లుగా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఆరోగ్య అవగాహన, స్వయం ఉపాధి ప్రాజెక్టులు, పాఠశాల పరిశుభ్రత, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు గుర్తింపుగా లభించిందని స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్లు ఈపు విజయకుమార్, సౌభాగ్యలక్ష్మి, కార్యదర్శులు వాక చిన్నంనాయుడు, ఎస్.కనకలక్ష్మి, ఆర్గనైజింగ్ కమిషనర్లు కె.గాయత్రి, డి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పురస్కార్ విజేతలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని వారు ఆకాంక్షించారు.


