జై పైడిమాంబ..జైజై పైడిమాంబ | - | Sakshi
Sakshi News home page

జై పైడిమాంబ..జైజై పైడిమాంబ

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

జై పైడిమాంబ..జైజై పైడిమాంబ

విజయనగరం కల్చరల్‌(క్రైమ్‌): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి కలశజ్యోతి ఊరేగింపు శనివారం అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా వనంగుడిలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ జరిపారు. అప్పటికే సిద్ధం చేసిన అలంకార రథంపై అమ్మవారిని ఉంచి దీక్షధారులు కలశ జ్యోతి ఊరేగింపును ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల భజనలు, జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయ ధ్వానాల నడుమ రైల్వే స్టేషన్‌, సీఎంఆర్‌, స్టేట్‌ బ్యాంక్‌, కన్యకాపరమేశ్వరి టెంపుల్‌, గంటస్తంభం, మూడులాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి వరకు పైడితల్లి అమ్మవారి కలశ ఊరేగింపు కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement