పుస్తకాలు పట్టాల్సిన చేతులకు.. సైలెన్‌ బాటిళ్లు! | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు పట్టాల్సిన చేతులకు.. సైలెన్‌ బాటిళ్లు!

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

పుస్తకాలు పట్టాల్సిన చేతులకు.. సైలెన్‌ బాటిళ్లు!

చదువుకోవాల్సిన వయసులో.. ఆస్పత్రుల పాలవుతున్న పిల్లలు గిరిజన బిడ్డల జీవితాలతో చెలగాటం ఇంకెన్నాళ్లీ నిర్లక్ష్యం? ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో తరచూ సీజనల్‌ వ్యాధుల విజృంభణ అయినా మారని ప్రభుత్వ తీరు గిరిజన సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తరచూ సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తూ విద్యార్థులను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. తాజాగా కురుపాం మండలం శివన్నపేట సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల లో ఒకేసారి సుమారు 80 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాల తో విద్యార్థినులు బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థినుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

గత ఘటనల నుంచి గుణపాఠం ఏదీ?

ఇదే కురుపాం గురుకుల పాఠశాలలో గతంలో పచ్చకామెర్ల వ్యాధి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వ్యాధి కారణంగా ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడగా.. మరో 200 మంది వరకు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కొద్ది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హడావిడి చేసినప్పటికీ.. తర్వాత పరిస్థితి షరా మామూలే అయ్యింది. పాఠశాలల్లో పారిశుధ్యం, తాగునీటి నాణ్యత, వైద్య పర్యవేక్షణ వంటి అంశాలపై శాశ్వత చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదువుకుంటే ఉన్నత స్థానాని కి చేరుకుంటారని ఆశించిన తల్లిదండ్రులు.. ఎక్క డో దూరాన ఉంచి తమ బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక.. సరైన సౌకర్యా లు, వైద్య సదుపాయాలు లేక విద్యార్థులు అనారో గ్యం బారిన పడి.. కొద్ది రోజులకే ప్రాణాలు విడుస్తు

న్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లా.. ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి నియోజకవర్గంలోనే పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ముందస్తు చర్యలు, నిరంత ర వైద్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్ర మైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. వరుస ఘటనలు చోటు చేసుకుంటు న్నా యంత్రాంగంలో ఆశించిన స్పందన కనిపించ డం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి సొంత జిల్లాలోనే దుస్థితి!

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తు న్న జిల్లాలోనే గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉండటం విచారకరం. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విద్యార్థుల కనీస ఆరోగ్య భద్రతను కూడా కాపాడలేకపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు పారిశుధ్యం, తాగునీటి నాణ్యతపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని విషాదాలు చోటు చేసుకునే ప్రమా దం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement