విజయనగరం లీగల్: శాశ్వత లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత ప్రజా న్యాయ పీఠంపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ శాశ్వత ప్రజా న్యాయ పీఠం ఏ సేవలు అందిస్తుందో వివరించారు. పలు సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరిస్తుందన్నారు. బీమా. బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల సేవలు. విద్య, విద్యాసంస్థలకు సంబంఽధించిన కేసులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన తగాదాలు, పారిశుధ్య సేవలు, ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలపై తగాదాలు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా కోర్టు ఫీజు కూడా ఉచితం. శాశ్వత అదాలత్ ద్వారా వచ్చిన కోర్టు తీర్పును అప్పీల్ చేసుకు అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ దుర్గయ్య, న్యాయ అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రమేష్ కుమార్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బెల్లాన. రవి, బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు, న్యాయవాదులు, పోస్టల్ అధికారులు, అడ్వకేట్స్ పాల్గొన్నారు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత


