న్యూస్‌రీల్
విగ్రహాలకు ముసుగులు
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు
గిరిజన ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు
సీతంపేట: గిరిజన ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిడ్డిక తేజేశ్వరరావు, సలహాదారు ఎ.మన్మథరావు, సెక్రటరీ, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.కాంతారావు, ఎన్.కాంతారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఏ రాముడుతో పాటు ముగ్గురు గిరిజన ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఎంపీడీఓ బి.రామకృష్ణ కులదూషణ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నట్టు గిరిజన సంఘాల దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
మలేరియా, డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు
పార్వతీపురం: జిల్లాలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, రాబోయే మూడు రోజులపాటు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో 100 శాతం లార్వా వేట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి దోమల వృద్ధి ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివాహాలు, జాతరలు, హస్టళ్లలో ఆహార భద్రత, పరిశుభ్రత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత్ రహార్, డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలు మృతి
రాయగడ: స్థానిక ఇందిరానగర్ మొదటి లైన్లో నివసిస్తున్న శతాధిక వృద్ధురాలు వై.నారాయణమ్మ (112) గురువారం మృతి చెందారు. ఆమె పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పరిధిలోని కొటిపాము గ్రామంలో 1914లో జన్మించారు. ఆమె చిన్న కుమారుడు చిన్నంనాయుడు ఉద్యోగ రీత్యా రాయగడలో స్థిరపడ్డారు. దీంతో కొడుకుతో పాటు ఆమె కూడా ఇక్కడే ఉంటున్నారు. గురువారం ఉదయం ఆమె మృతి చెందినట్లు మనువడు వై.దామోదరరావు తెలిపారు. ఆమె జీవించినంత కాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా తన పనితానే చేసుకునేవారని చెప్పారు. తమ కుటుంబంలో ఐదు తరాలను చూసిన నారాయణమ్మ సహజ మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
స్థానిక సమరానికి సమయం ఆసన్నమైంది. ఎన్నికల ఘట్టంలో తొలి అడుగు కొద్దిసేపట్లో పడనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయగా.. అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం నుంచి మొదలుకానుంది. జిల్లాలో తొలివిడతగా పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రచురణతో పాటు.. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఆయా పురపాలక సంఘాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. తొలిరోజు నామినేషన్లు పడే అవకాశం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయ పక్షాలు ఇంకా గెలుపు గుర్రాల వేటలోనే ఉన్నాయి. ప్రధానంగా అధికార కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రాలేదు. సప్తమి కలసి రావడంతో అధిక శాతం మంది ఈ నెల 17న నామినేషన్లు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. మరోవైపు అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికెట్ల కోసం పరుగులు తీస్తున్నారు.
పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బి. రాంగోపాల్ తెలిపారు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలో ప్రత్యేక బృందాలతో ఏర్పాట్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.
శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం తొమ్మిది గదులను సిద్ధం చేశామన్నారు. ప్రతి 4 వార్డులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయగా.. చైర్మన్ నామినేషన్ల కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయించామని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో బకాయిలు ఉన్నవారు నో డ్యూ సర్టిఫికెట్లు పొందేందుకు రెవెన్యూ విభాగాన్ని ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మూడు షిఫ్టుల్లో హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. రెండో అంతస్తులోని మెటీరియల్ రూములకు సీసీ కెమెరాలు, పోలీసు భద్రతతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని, రహస్య పత్రాల భద్రత కోసం కొత్త బీరువాలను కూడా సమకూర్చామన్నారు. వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రతి రూమ్‌లో డిజిటల్ క్లాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక లాగిన్ రూపొందించి, ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
గెలుపు గుర్రాల కోసం వైఎస్సార్సీపీ అన్వేషిస్తోంది. మూడు చోట్లా తమ పట్టును నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కకుండా ఉంటే.. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తారని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. మరోవైపు కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మూడు చోట్లా మహిళలే చైర్మన్ అభ్యర్థులుగా ఉన్నారు. రిజర్వేషన్‌తోపాటు, సీట్ల పంపకాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరికి వారు మెట్టు దిగడం లేదు. ప్రధానంగా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కోసం జనసేప పట్టుపడుతోంది. ఎవరు ఎక్కడ నుంచి బరిలో దిగనున్నారో ఈ రోజు తేలిపోయే అవకాశాలున్నాయి. సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం అధికార పార్టీలోనే వర్గాలుగా విడిపోయి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. సీటు కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడానికై నా కొంతమంది వెనుకాడడం లేదు.
సాక్షి, పార్వతీపురం మన్యం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 226 ఎంపీటీసీ స్థానా లకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో జనరల్ 117 స్థానాలు కాగా.. మహిళలకు 109 కేటాయించారు.
కేటగిరీల వారీగా:
ఎస్టీ – 71 (జనరల్ 40, మహిళ 31)
ఎస్సీ – 22 (జనరల్ 12, మహిళ 10)
బీసీ – 35 (జనరల్ 18, మహిళ 17)
అన్ రిజర్వుడు – 98(జనరల్ 47, మహిళ 51)
నేడు మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి నామినేషన్
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీదభద్ర స్వామి ఇంటి నుంచి భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి తరలివెళ్లనున్నారు.
పురపాలక పోరుకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
పార్వతీపురం, సాలూరు, పాలకొండల్లో ‘స్థానిక’ సందడి
అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీల కసరత్తు
కూటమికి సర్దు‘పోటు’
స్థానిక ఎన్నికల కోడ్ గురువారం నుంచి అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు పడుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ఉన్న పార్టీల ఫ్లెక్సీలను, జెండాలను తొలగిస్తున్నారు. ఇందులో వివక్షకు తావు లేకుండా.. కోడ్ పక్కాగా అమలు చేయాలని పలు పార్టీల నాయకులు కోరుతున్నారు.


