నగరంపై సంపూర్ణ అవగాహన... | - | Sakshi
Sakshi News home page

నగరంపై సంపూర్ణ అవగాహన...

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

పురపోరుకు ఘంటారావం మోగింది. అధికార కూటమిలో సీట్లు కుమ్ములాటలు ఆరంభమయ్యాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కోలగట్ల శ్రావణిని బరిలో దించేందుకు రంగం సిద్ధంచేసింది. ఏపీ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయ వారసత్వాన్ని ఒడిసి పట్టిన శ్రావణి.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఈ సారి నేరుగా మేయర్‌గా పోటీ చేసేందుకు బరిలోకి దిగారు. నగర ప్రజల సంపూర్ణ మద్దతు కూడగట్టి ప్రత్యక్ష ఎన్నికల బరికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడెక్కడ ఎవరు బలమైన అభ్యర్థులు, ఎవరిని ఎలా కలుపుకొని పోవాలి? ఆయా వార్డుల్లో అవతల వైపు ఎవరెవరు పోటీ చేస్తున్నారు? వారిని ఎలా ఢీకొనాలి అనే సమీకరణాలు వేస్తూ ప్రచార ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

● ప్రజలతో మమేకం..

శ్రావణికి నగరంలో బంధుగణంతో పాటు అభిమానులు అధికమంది ఉన్నారు. పార్టీ శ్రేణులతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన వార్డు వలంటీర్లను పేర్లుపెట్టిపిలిచే చనువు, ఆయా కుటుంబాలతో అనుబంధం ఉంది. పార్టీ నాయకుల వద్ద గౌరవం ఉంది. ప్రతీ వార్డు ప్రజలను ఆత్మీయంగా అక్కున చేర్చుకునే గుణం ఆమె సొంతం. ఇవన్నీ ఆమె విజయానికి పునాదులుగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

● మేయర్‌ పీఠంపై జనసేన ఆశలు

ఇదిలా ఉండగా విజయనగరం మేయర్‌ పదవి తమకు కేటాయించాలని జనసేన పట్టుపడుతోంది. ఈ మేరకు జనసేన నాయకులు కొందరు ఇప్పటికే అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసినట్టు తెలిసింది. ఈ మేరకు తాము రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధం అని ప్రతిపాదనలు సైతం పంపించారని భోగట్టా. మేయర్‌ వాటాల పంపిణీలో టీడీపీ, జనసేనల్లో ఎవరికి వస్తుందన్నది ఇంకా తేలలేదు. మరోవైపు పట్టణంలోని 62 వార్డుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు ఎవరికి ఎన్ని వార్డులు కేటాయిస్తారన్నది కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో కూడా కూటమి పార్టీల మధ్య చర్చ ఇంతవరకు జరగలేదు. దీంతో ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలన్నదానిమీద కూడా స్పష్టత లేకపోవడంతో కూటమి పార్టీల మధ్య స్తబ్ధత నెలకొంది. ఒకవార్డు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయాలనుకున్నా అదికాస్తా జనసేనకు కేటాయిస్తే తన శ్రమ..ఖర్చు వృథా అయిపోతాయన్న ఆందోళన టీడీపీ వారిలో నెలకొంది. అందుకే ఎక్కడివారు అక్కడే గప్‌ చుప్‌గా ఉన్నారు. దీంతో ఎవరికి.. ఎక్కడ ఏ స్థానం దక్కుతుందో తెలియక టెన్షన్‌తో గుడ్లు మీటకరించి చూస్తున్నారు. మరోవైపు మేయర్‌ స్థానాన్ని పొరపాటున టీడీపీకి కేటాయిస్తే ఓడిస్తామంటూ జనేసేన శ్రేణులు కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడంతో టెన్షన్‌ మొదలైంది.

డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు పట్టణంలోని అన్ని వార్డులను గత ఐదేళ్లపాటు కలియదిరిగిన శ్రావణి ఆయా వార్డులోని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఇది మన విజయనగరం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కోలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధి పనులు చేశారు. అదే ఒరవడిలో ఆమె తనయ కూడా ప్రతివార్డు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఎన్నికల వైపు అడుగువేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement