పెందుర్తి: ఓ నిరాశ్రయ వృద్ధుడికి పెందుర్తి పోలీసులు ఆశ్రయం కల్పించారు. పెందుర్తి కూడలి అనకాపల్లి బస్టాప్ వద్ద నంబారు ఆంథోని(70) అనే వృద్ధుడు కొద్దిరోజులుగా తిరుగాడుతున్న విషయాన్ని బ్లూకోట్స్ కానిస్టేబుల్ లెక్కల చంద్రశేఖర్ గుర్తించారు. వెంటనే విషయాన్ని సీఐ కేవీ సతీష్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సీఐ ఆదేశాల మేరకు ఆంథోనీని స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అతని కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపాలెంలో ఉన్నట్లు గుర్తించామని..వారిని పిలిపించి అప్పగంచే ప్రయత్నం చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.


