విజయనగరం జిల్లాలో అన్ని కేటగిరీల పింఛన్లకు సంబంధించి 52,090 మంది దరఖాస్తు చేసుకు న్నారు. వీరిలో 5 వేలు వరకు అర్హతలేని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి కొత్తగా ఎవరికీ పింఛన్లు మంజూరు కాలేదు. – శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ
హామీలు ఇవ్వడం.. జనాన్ని నమ్మించడం.. అవసరం తీరాక మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన అర్హులందరికీ పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నాక రెండున్నరేళ్లుగా మొఖం చాటేశారు. 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి సైతం పింఛన్లు మంజూరు చేయలేదు. స్థానిక ఎన్నికల వేళ... మళ్లీ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రచారం చేశారు. అక్టోబర్ నెల నుంచి పింఛన్లు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. తీరా... తూచ్ అనడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


