సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఒంటికాలిపై నిలబడి ఆందోళన 758 మందికి వైద్య పరీక్షలు ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ● జేసీ ఆర్‌.వైశాలి ఘనంగా పర్యాటన దినోత్సవం

పార్వతీపురం రూరల్‌: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలి మ్స్‌, మెయినన్స్‌) ఉచిత శిక్షణ అందించనున్న ట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.శ్యామల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కోసం అక్టోబర్‌ 5వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు రెండు ఫొటోలు, విద్యార్హత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, పాన్‌ కార్డు నకళ్లను జతచేయాలి. పూర్తిచేసిన దరఖాస్తులను అక్టోబర్‌ 20 లోగా పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఆర్‌సీఎం స్కూల్‌, మొదటి అంత స్తు (రూమ్‌ నంబర్‌ 8)లో ఉన్న జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో పనివేళల్లో సమర్పించాలి. పూర్తి వివరాలకు ఫోన్‌ 97017867 51, 9160801497, 9492545375 నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటనలో వెల్లడించారు.

పార్వతీపురం రూరల్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఒంటికాలిపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, 100 శాతం గ్రాస్‌ వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

పాలకొండ: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పాలకొండ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 758 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు నిపుణులైన వైద్యులు వాగ్దేవి, రౌతు భారతి, ఆర్‌ఎంవో రవికుమార్‌, భరణి, భాగ్యశ్రీ, యశస్విని వైద్య సేవలు అందించారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కడియం చిరంజీవి తెలిపారు.

గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయ ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి అన్నా రు. గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య ఆదర్శ గురుకు ల పాఠశాల క్రీడామైదానంలో బుధవారం క్రీడాజ్యోతిని వెలిగించి క్లస్టర్‌–1 క్రీడా పోటీల ను ప్రారంభించారు. క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల కు హాజరైన 400 మంది క్రీడాకారులనుద్దేశించి జేసీ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. తహసీల్దార్‌ ఆర్‌.రంజిత్‌కుమార్‌, ఏటీడబ్ల్యూఓ ఎల్‌.రజని, ప్రిన్సిపాల్‌ వీర్‌సింగ్‌, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని మహారాజా అటానమస్‌ కళాశాలలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, సామాజిక శాస్త్రాల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల భోజరాజా ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో పర్యాటక రంగ ప్రాముఖ్యత, ఆర్థికాభివృద్ధిలో దాని పాత్రను వక్తలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement