గత ప్రభుత్వం హయాంలో రిజర్వేషన్ల కోత పడినప్పుడు నానా యాగీ చేసిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే నాటకాన్ని ఎందుకు రిపీట్ చేశారు? ఇది పరిపాలనా వైఫల్యం కాదు, ఉద్దేశపూర్వక కుట్ర. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్న పైశాచిక ఆనందం ఆయన తీరులో స్పష్టంగా కనిపిస్తోంది. నివేదిక లేకుండా జీవోలు జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేయడానికే ఆయన తనదైన శైలిలో న్యాయపరమైన చిక్కుముడులు సృష్టించారు. ఢిల్లీ స్థాయిలో తన మాటే వేదమని చెప్పుకునే బాబు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్‌లో ఈ రిజర్వేషన్లను ఎందుకు చేర్చలేకపోయారు? పత్రికల్లో ప్రకటనలకు, సభల్లో ఆకర్షణీయమైన ప్రసంగాలకు మాత్రమే పరిమితమైన బాబుగారి కపట ప్రేమ, హైకోర్టు తీర్పుతో పూర్తిగా బట్టబయలైంది.
– మజ్జి శోభారాణి మాజీ ఎంపీపీ, పార్వతీపురం


