నామమాత్ర వేతనంతో బతుకు భారం | - | Sakshi
Sakshi News home page

నామమాత్ర వేతనంతో బతుకు భారం

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

నామమాత్ర వేతనంతో బతుకు భారం ● కలెక్టరేట్‌ ఎదుట ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన ● రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌

● కలెక్టరేట్‌ ఎదుట ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన ● రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌

పార్వతీపురం రూరల్‌: ఇరవై ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్నా తమ బతుకుల్లో వెలుగులు నిండడం లేదంటూ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమరశంఖం పూరించారు. నామమాత్రపు వేతనాలతో కాలం వెళ్లదీయలేకపోతున్నామంటూ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌, డ్వామా కార్యాలయాల ఎదుట భారీ నిరసన చేపట్టారు. కేవలం నెలకు రూ.5,700లు చెల్లిస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్ల శ్రమను దోచుకోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, జేఏసీ కన్వీనర్‌ బీవీ రమణ, యూనియన్‌ అధ్యక్షుడు మండంగి హరినాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి రాజకీయ వేధింపులకు చెక్‌ పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు. మూడేళ్ల సర్వీసు పూర్తయిన వారికి పదోన్నతులతో పాటు ఉద్యోగ విరమణ సదుపాయాలు కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో హేమలత, డ్వామా పీడీ రామచంద్రరావులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ ఆందోళనలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ నాయకులు వెంకటరమణ, సంఘంనాయుడు, మోహన్‌ దాసు, సింహాచలం, శంకరరావు, గౌరీశంకర్‌, రెడ్డి ఆదినారాయణ, పకీర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement