వెన్నుపోటు పొడవడం, నమ్మకద్రోహం చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి అని చెప్పడానికి స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారమే సజీవ సాక్ష్యం. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కోర్టులు అడ్డుకున్న విషయం తెలిసి కూడా, మళ్లీ అవే తప్పుల తడక జీవోలను తీసుకురావడం వెనుక ఉన్నది బీసీల మీద ప్రేమ కాదు.. వాళ్ల ఓట్ల మీద ఉన్న దుగ్ధ మాత్రమే. సరైన చట్టపరమైన రక్షణ కల్పించకుండా జీవోలు ఇవ్వడమంటే, నీళ్ల మీద రాతలు రాయడమేనని బాబుగారికి ఎందుకు అర్థం కాలేదు? బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు, తన వెన్నెముక అని ప్రగల్భాలు పలికే నోళ్లు ఇప్పుడు ఏమయ్యాయి? డెడికేషన్ కమిటీ పేరుతో ఆడిన డ్రామా రక్తికట్టలేదు. చట్టం చేయడానికి ప్రయత్నించకుండా పబ్బం గడుపుకున్న ఈ నయవంచనను బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదు.
– యిండుపూరు గున్నేశ్వరరావు /
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, పార్వతీపురం


