● ఎంపీ తనూజారాణి ● విశ్రాంతి భవనాలు ప్రారంభం
భామిని: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి తెలిపారు. భామిని, లివిరిలో ఎంపీ ల్యా డ్స్‌తో నిర్మించిన విశ్రాంతి భవనాలను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యను మాజీ ఎమ్మెల్యే ద్వారా తెలుసుకొని రూ.10లక్షల వ్యయంతో మోడల్ స్కూల్ కూడలిలో విశ్రాంతి భవనం నిర్మించినట్టు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ప్రయోజకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తొలుత ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులకు విద్యార్థులు ఘన స్వాగ తం పలికారు. ప్రిన్స్‌పాల్ బాబూరావు ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్ తనూజారాణిను సన్మానించారు. అనంతరం భామిని కూడలిలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి తోట సింహాచలం, పార్టీ మండలాధ్యక్షు డు బోదెపు శ్రీనివాసరావు, డీఈఈ లోకనాథం, ఎంపీడీఓ వసంతకుమారి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ–అరకు రైలు పునరుద్ధరణకు వినతి
పార్వతీపురం రూరల్: కేకే రైల్వే మార్గంలో ట్రాక్ దెబ్బతినడంతో నిలిచిపోయిన రైలు సేవలను, మార్గం సురక్షితంగా ఉన్న విశాఖ–అరకు మధ్యన తక్షణమే పునరుద్ధరించాలని కార్మిక, వ్యాపార సంఘాలు కోరాయి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వ య కమిటీ సమావేశానికి విచ్చేసిన అరకు ఎంపీ గుమ్మా తనూజరాణికి ‘అరకు శ్రీశ్రీ వాయుపుత్ర మోటార్ యూనియన్’, ’బొర్ర ట్రైబల్ టాక్సీ యూనియన్’ ప్రతినిధులు కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. రైలు రాకపోకలు పది రోజులుగా నిలిచిపోవడంతో పర్యాటకులపై ఆధారపడి జీవిస్తున్న ఆటో, ట్యాక్సీ కార్మికులు, హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారుల కుటుంబాలకు ఉపాధి కరువైందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ రైలు సేవల పునరుద్ధరణకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


