నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

వీరఘట్టం: ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఇలా అన్ని యాజమాన్య పాఠశాలల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపునకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఎంతో కీలకం.దీంతో పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈనెల 29న ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆయా ఎస్‌ఎంసీలో స్థానం సంపాదించుకునేందుకు ఆశావహులైన విద్యార్థుల తల్లిదండ్రులు రాజకీయ పార్టీల నాయకులను ఆశ్రయిస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తల్లిదండ్రుల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉండగా ఆయా పార్టీల నాయకులు సైతం తమకు అనుకూలమైన వారికి సిఫారసు చేస్తూ ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే రాజకీయ ప్రమేయం లేకుండా ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఈ ఎన్నికలు తమ కనుసన్నల్లోనే జరిగేలా రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు.

జిల్లాలో 81,598 మంది ఓటర్లు..

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రాథమిక, మోడల్‌ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు,గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌, కేజీబీవీ ఇలా అన్ని మేనేజ్‌మెంట్‌లలో 1,604 సర్కారు బడులు ఉన్నాయి.అలాగే 98 ప్రైవేటు పాఠశాలతో కలిపి 1702 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో చదువుతున్న 1,35,352 మంది విద్యార్థులు ఉండగా, 81,598 మంది తల్లిదండ్రులు ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి

మంగళవారం జరగనున్న ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రధానోపాధ్యాయులందరికీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించాం. అలాగే అన్ని మండలాలకు ఎన్నికల పరిశీలకును నియమించాం. ఎటువంటి తగాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసుల సహకారం కూడా కోరాం. ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు సహకరించాలి.

– పి.బ్రహ్మాజీరావు, డీఈఓ పార్వతీపురం మన్యం జిల్లా

ఫ జిల్లాలోని 1702 పాఠశాలల్లో

ఎన్నికలకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement