పార్వతీపురం: పారదర్శకమైన ఓటర్ల జాబితా రూప కల్పనే ఎస్‌ఐఆర్–2026 లక్ష్యమని ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.వెంకటమురళి అన్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డితో కలిసి ఈఆర్ ఓలు, ఏఈఆర్‌ఓలతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రి యపై సమీక్షించారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని, ఓట్ల తొలగింపు, సవరణలకు సంబంధించిన కారణాలు, అప్పీల్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. శతశాతం వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. జేసీ ఆర్.వైశాలి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ హేమలత, ఆర్డీఓ కె.మాధురి పాల్గొన్నారు.


