ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

● కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ ఆర్‌.వైశాలి, ఎస్‌డీసీ ధర్మారావు, డీఆర్‌డీఏ పీడీ సీహెచ్‌ ప్రభావతితో కలిసి ప్రజల నుంచి 108 వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో 25 రెవెన్యూకు సంబంధించినవి కాగా మిగిలిన 83 సాధారణ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గదువులోగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. చినబొండపల్లిలో శిథిలావస్థకు చేరిన ఆర్‌సీఎం చర్చి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎమ్మార్‌నగరంలో అనుమతులు లేకుండా జరుగుతున్న ఇంటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, అర్హులకు అంత్యోదయ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. గరుగుబిల్లి మండలం చిలకాం రెవెన్యూ పరిధిలోని కారివలసలో పట్టావాని చెరువు భూముల ఆక్రమణకు గురవుతున్నాయని, ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధరించాలని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.

నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. కుటుంబ, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు సంబంధించి ఈ కార్యక్రమంలో మొత్తం 8 ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఎస్పీ అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి, నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సైలు అశోక్‌ చక్రవర్తి, శిరీష, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 24 వినతులు

సీతంపేట: ఐటీడీఏలో పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 24 వినతులు వచ్చాయి. చిన్నకింగ గ్రామానికి రైస్‌కార్డులు, విద్యుత్‌ సదుపాయం కల్పించాలని సవర పబిత్ర కోరారు. మణిగ గ్రామంలో కమ్యూనిటీ సోక్‌ పిట్‌ బిల్లులు మంజూరు చేయాలని కె.చంటి వినతి ఇచ్చారు. జన్నోడుగూడకు అంతర్గత సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. ఎగువముల్లెలగూడకు రచ్చబండ నిర్మించాలని సవర రాజేషు కోరారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, జీసీసీ డీఎం కృష్ణ, పీహెచ్‌వో ఎస్‌.వి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement