కొనసాగుతున్న ఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆర్చరీ పోటీలు

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు సోమవారం మహిళలు, పురుషులకు వేర్వేరుగా 30 మీటర్ల ఇండియన్‌ రౌండ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌, రామనారా యణం తరఫున మెడల్‌, ప్రశంసాపత్రం, స్వామి వారి వస్త్రాలు, పుస్తకం అందజేశారు. కార్యక్రమంలో అప్పా చైర్మన్‌ సత్యనారాయణ, ఎన్‌సీఎస్‌ ట్రస్టీలు నారాయణం మృదుల, నీరజా శ్రీని వాస్‌, చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు.

చెస్‌ పోటీల జిల్లా జట్టుకు 10 మంది ఎంపిక

గంట్యాడ: మండలంలోని లక్కిడాం జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం అండర్‌–19 చెస్‌ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం.జి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అక్టోబర్‌ 1,2 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో జరిగే పోటీల్లో వీరు జిల్లా తరఫున పోటీల్లో పాల్గొంటారని పీడీ జి.తవిటయ్య తెలిపారు.

వచ్చే నెల 4న అండర్‌ – 14 క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయనగరం: వచ్చే అక్టోబర్‌ నెల 4న అండర్‌–14 బాలుర జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్‌ అసొసియేషన్‌ ట్రెజరర్‌ ఎంఎస్‌ఎన్‌ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు అక్టోబర్‌ 3న ఫారం–5లో క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఒరిజనల్‌ జనన ధ్రువీకరణ పత్రం, ముందు రోజు డౌన్‌లోడ్‌ చేసిన ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్‌తోపాటు వాటి జిరాక్స్‌ కాపీలను అందజేయాలన్నారు. క్రీడాకారులు అందజేసిన పత్రాలను పరిశీలించి, అర్హులైన వారిని ఎంపిక పోటీలకు పిలవనున్నట్లు, అక్టోబర్‌ 4న ఉదయం 8 గంటలకు విజ్జి స్టేడియంలో నిర్వహించే ఎంపిక పోటీలకు క్రీడాకారులు తెలుపుదుస్తులు ధరించి రావాలని, అలాగే సొంత కిట్టుతో హాజరు కావాలని స్పష్టం చేశారు.

10 లీటర్ల సారా పట్టివేత

సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ ప్రాంతంలో 10 లీటర్ల సారా పట్టుకున్నట్లు పాలకొండ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.వెంకటరాజు సోమవారం తెలిపారు.ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సారా వండినా అక్రమరవాణా చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement