పార్వతీపురం: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ, వీడియో, రీల్స్ పోటీల గడువును అక్టోబర్ 4వ తేదీ వరకు పొడిగించి నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అభ్యర్థులు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు ప్రజల నుంచి వచ్చిన స్పందన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన్యం ప్రకృతి అందాలు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలను జీమెయిల్‌లో డీటీఓ.ఏపీటీఏపీవీపీఎంకు పంపించాలన్నారు. అలాగే వాట్సాప్ నంబర్ 9100109162కు పంపాలని సూచించారు. ఉత్తమ ఎంట్రీలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
–11న నిజరూప దర్శనం
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారు సోమవారం తెరచాటుకు వెళ్లారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో సంప్రదాయ బద్ధంగా ఉత్సవాలకు 13 రోజుల ముందు నుంచి అమ్మవారిని గర్భగుడిలో తెరవేసి మూసివేయడం ఆనవాయితీ. ఇక్కడి నుంచి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రారంభం రో జు వరకు ఆలయంలో ఉత్సవ మూర్తి దర్శనం మాత్రమే భక్తులకు ఉంటుంది. దసరా ఉత్సవా ల ప్రారంభం రోజున అమ్మవారి నిజరూపం దర్శనం భక్తులకు కలుగుతుంది. ఏడాదిలో ఒక్కరోజులో కొన్ని గంటలు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 11న అమ్మవారి నిజ రూపం దర్శనం ఉంటుంది. ఆ మేరకు దేవదా యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏ డీడీగా ఇన్‌చార్జ్ బాధ్యతలు గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవో రజనికి అప్పగించారు. ఇప్పటి వరకు డీడీగా ఉన్న విజయశాంతి బదిలీపై తన సొంత పోస్టుకు వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఇక్కడ రిలీవయ్యారు. గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవోగా ఉన్న రజనికి కొద్దిరోజుల క్రితమే విజయనగరం డీటీడబ్ల్యూవోగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అదనంగా కీలకమైన డీడీ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించడం గమనార్హం. కీలకమైన మూడు పోస్టుల్లో ఆమె ఏ మేరకు నెట్టుకువస్తారో చూడాలి. వాస్తవానికి రజని కంటే సీనియర్‌గా కృష్ణవేణి ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె కొద్దిరోజులు సెలవు పెట్టారు. ఇన్‌చార్జి బాధ్యతలు సీనియారిటీ ప్రకారం కృష్ణవేణికే ఇవ్వాల్సి ఉంది. కొన్నాళ్లపాటు వారిలో ఎవరో ఒకరితో సరిపెట్టేస్తారా? కొత్తగా ఎవరైనా వస్తారా? అన్నది చూడాలి.


