ఐటీడీఏ చరిత్రలో ఇలా లేదు
నేడు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
ఎంపీపీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిశాక సమావేశం
విస్తుపోతున్న ప్రజాప్రతినిధులు
మమ అనిపించేందుకు ప్రభుత్వ యత్నమని గిరిజనుల ఎద్దేవా
గిరిజనుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి
సీతంపేట:
సీతంపేట ఐటీడీఏలో పాలకవర్గ సమావేశం నిర్వహించడానికి ఎట్టకేలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు ఒక గవర్నింగ్ బాడీ సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. మంగళవారం 78వ పాలకవర్గం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2022 జనవరి 29న 77వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అటు తరువాత మరి పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేదు. కనీసం చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహిస్తే ప్రజాసమస్యలు చెప్పుకుందామని వేచి చూసిన జెడ్పీటీసీలు, ఎంపీపీల కు ప్రభుత్వ నిర్వాకంతో కుదరలేదు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాలకవర్గంలో సభ్యులు. ప్రతి మూడు నెలలకో మారు కలెక్టర్ అధ్యక్షతన ఐటీడీఏలో సమావేశమై వివిధ శాఖల పనితీరు అధికారులతో సమీక్షించాల్సి ఉంది. విశేషమేమిటంటే మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)లు జెడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది.
ప్రజాసమస్యలు ఎవరు ప్రస్తావిస్తారు?
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గ్రామాల్లో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలను ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎమ్మెల్యేలు, అధికారుల దృషికి తీసుకువెళ్లే అవకాశముంటుంది. ప్రస్తు తం కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గ్రామాల్లోని సమస్యలు సమావేశంలో ఎవరు ప్రస్తావిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలతో ఎప్పు డూ మమేకమై ఉండి సమస్యలు తెలుసుకుని ఐటీడీఏ గవర్నింగ్ బాడీ దృష్టికి తీసుకువెళ్లే ఎంపీపీ, జెడ్పీటీసీలు సమావేశంలో లేనపుడు ఈ సమావేశం ఎలా సాగుతుందన్న చర్చ జరుగుతోంది.
సమస్యలు యథాతథం.. పరిష్కారం అంతంతే..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. 1224 గ్రామాలున్నాయి. సుమారు 2 లక్షల మంది గిరిజన జనా భా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నా రు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన తుఫా న్‌కు అనేక గ్రామాల్లో రహదారుల్లో రాళ్లు తేలాయి. ఉపాధి హామీ పథకంలో ఇటీవల నిర్మించిన కొన్ని రహదారులు నాణ్యతా లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేవు.
అటవీ ఉత్పత్తులకు గిట్టు ధరలు ఏవీ?
గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనులకు గిట్టుబాటు ధరలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిరిజనులు సేకరిస్తున్న అటవీఉత్పత్తులను ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయడం లేద ని స్థానికులు పేర్కొంటున్నారు. డీఆర్‌డిపోల ద్వారా విక్రయించే నిత్యావసర సరుకుల ధరలు బయట మార్కెట్‌తో పోలిస్తే పెద్దగా తేడా లేకపోవడంతో గిరిజనులకు ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు. వెలుగు ద్వారా ఏర్పాటు చేసిన వన్‌ధన్ వికాస్ కేంద్రాలు (వీడీవీకే)ల పనితీరు అధ్వానంగా ఉందని, యూనిట్‌లు ఏర్పాటు చేశారు తప్ప వాటికి కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యం లేదని, కొండచీపుళ్లు, జీడి, పసుపు ఇతర యూనిట్లు సక్రమంగా పనిచేయడం లేదని గిరిజనుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వైద్యసేవలు గగనమే..
24 గంటలు పనిచేసే పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో పూర్తిస్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఇటీవల విజృంభించా యి. నివారణ చర్యలు నామమాత్రమే.
సమస్యలపై సరైన చర్చజరుగుతుందా?...
రెండున్నరేళ్ల తరువాత జరుగుతున్న ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజన ప్రాంతాల మౌలిక సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, రహదారులు, తాగునీరు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి పరిష్కారాలకు కార్యచరణ రూపొందిస్తారా? లేక సమావేశం నిర్వహణకే పరిమితమౌతుందా అనేది వేచిచూడాలి.
ఐటీడీఏ చరిత్రలో ఇలా ఎప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీలు లేకుండా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం సకాలంలో పాలకవర్గ సమావేశాలు నిర్వహించకుండా తాత్సారం చేసి పాలనలో భాగమైన ఎంపీపీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన త రువాత గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించడం సిగ్గుచేటు.
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
ప్రజల ఓటు హక్కుతో గెలి చాం. మమ్మల్ని ఇలా అవమానించడం తగదు. మాకు పదవి ఉన్నప్పుడు పాలకవర్గ సమావేశం పెట్ట కపోవడం అంటే సమస్యలపై ప్రశ్ని స్తామనే భయంతోనే ఇలా చేశారు. 20 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేకుండా ఏం సమావేశం నిర్వహిస్తారు.
–ఎస్.లక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు


