అందరూ అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అందరూ అప్రమత్తంగా ఉండాలి

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

అందరూ అప్రమత్తంగా ఉండాలి ● అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

పార్వతీపురం: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్‌ అంతరాయాలు, రహదారి సమస్యలను వెంటనే పరిష్కరించాల ని సూచించారు. మట్టి ఇళ్లలో నివసిస్తున్న 25 కుటుంబాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. పార్వతీపురం బైపాస్‌ కాలనీ బాలుర వసతి గృహంలోకి నీరు చేరడంతో 40 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి ఆహారం, మందులు అందించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ.మాధవరెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి సూచించారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న కల్వర్టులు దాటవద్దని, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, పాత భవనాలవద్ద ఉండరాదని హెచ్చరి చ్చారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

గర్భిణుల భద్రతకు ప్రత్యేక చర్యలు

కాన్పు సమయం సమీపించిన గర్భిణులను తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తుగా ఆస్పత్రులకు తరలించా లని కలెక్టర్‌ ఆదేశించారు. సెప్టెంబర్‌ 23నుంచి 30 మధ్య ప్రసవం అయ్యే అవకాశం ఉన్న 158 గర్భిణులను గుర్తించి, ఇంతవరకు 75 మందిని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. మిగిలిన వారినికూడా ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు, పౌిష్టికాహారం, సురక్షిత వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

13 చెరువులకు అలర్ట్‌

భారీ వర్షాల నేపథ్యంలో 20 ప్రధాన చెరువుల్లో 13 చెరువులకు అలర్ట్‌, రెండు చెరువులకు వార్నింగ్‌, ఐ దు చెరువులకు సూచనలు(కాషన్‌) ప్రకటించినట్లు కలెక్టర్‌ తెలిపారు. బలిజిపేట, సీతంపేట, బలిజిపే ట మండలాల్లో చెరువుల నీటిమట్టాలుపెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేప ట్టి, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముంద స్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement