పార్వతీపురం రూరల్: తుఫాన్ ప్రభావంతో ఉప్పొంగుతున్న వరదలను నిలువరించేందు కు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు గురువారం రంగంలోకి దిగారు. ఎస్పీ మాధవ్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వరహాలగడ్డ వద్ద భారీగా చేరిన వరద నీటికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్కను జేసీబీల సహాయంతో మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. ఈ పనుల ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో సీఐ బి.వెంకటరావు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సురక్షిత ప్రాంతాలకు మళ్లించా రు. అలాగే బైపాస్ కాలనీలోని బాలుర వసతి గృహంలోకి నీరు చేరినట్లు సమాచారం అందడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో కె.మాధురి అక్కడికి చేరుకుని వసతి గృహాన్ని పరిశీ లించారు. విద్యార్థులకు ధైర్యం చెప్పారు.


