వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ సోమవారం తెలిపారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 5,600 కూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో రెండు గేట్లుఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. సాగునీటి అవసరాల కోసం కుడి ప్రధాన కాలువకు 300 క్యూసెక్కు ల నీటిని సరఫరా చేస్తున్నామని ఏఈ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 64.55 మీటర్ల నీటిమట్టం నమోదైందన్నారు.


