● ఇవన్నీ ఎన్నికల గుర్తులే
● గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి
సాక్షి, పార్వతీపురం మన్యం: మున్సిపల్, పరిషత్తు ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయ వేడి గ్రామాలకు మళ్లింది. జిల్లాలోని 451 పంచాయతీల్లో ఈ నెల 26, 29న రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీకి అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.
సర్పంచ్ గుర్తులు ఇవే..
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష పండ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
వార్డు సభ్యుల గుర్తులు..
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇసీ్త్రపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు.


