అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

నెల్లిమర్ల రూరల్‌: తుపాను వర్షాల నేపథ్యంలో కాజ్‌వేలు, నదులు, చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి, హౌసింగ్‌ పీడీ జి.మురళీమోహన్‌ సూచించారు. మండలంలోని కొండవెలగాడ–పారసాం రహదారిలోని కాజ్‌వేను ఆయన గురువారం పరిశీలించారు. కాజ్‌వే వద్ద నీటి ప్రవాహం, రాకపోకల పరిస్థితిని పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని అయితే నీటిలో దిగే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దన్నారు. కాజ్‌వేలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గణేశుని నిమజ్జనోత్సవాల్లో యువత అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీటీలు కల్యాణి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement