సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ మద్యం దుకాణాలను 1.10.2026 నుంచి 30.9.2027 కాలానికి రెన్యువల్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా జిల్లాలోని 56 ఏ–4 దుకాణాల లైసెన్సుదారుల నుంచి ప్రొహిబిషన్–ఎకై ్సజ్ అధికారులు రెన్యువల్ కోసం కోరగా .. అందులో 47 మందే ముందుకొచ్చారు. ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో చూసుకుంటే.. కురుపాంలో ఆరు దుకాణాలకు ఆరు, పాలకొండలో 13కు గానూ 12, సీతానగరంలో 12కి 11, సాలూరులో 14కు 10, పార్వతీపురంలో 11 దుకాణాలకు ఎనిమిది మంది రెన్యువల్ చేసుకున్నారు. వీరంతా రెన్యువల్ రిటైల్ ఎకై ్సజ్ పన్ను, దరఖాస్తు రుసుముగా రూ.11.53 కోట్లు, వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయి దా కింద రూ.7.56 కోట్లు, పర్మిట్ రూం పన్ను కింద రూ.1.03 కోట్లు చొప్పున మొత్తం రూ.20.12 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. మిగిలిన తొమ్మిది దుకాణాల రెన్యువల్‌కు ముందుకు రాలేదు.
మిగిలిన తొమ్మిది దుకాణాలకు
నోటిఫికేషన్ జారీ
మిగిలిన తొమ్మిది దుకాణాల (సీతానగరం మండలం–1, పాలకొండ రూరల్ –1, సాలూరు మున్సిపాలిటీ–3, సాలూరు మండలం–1, పార్వతీపురం మున్సిపాలిటీ–2, పార్వతీపురం మండలం–1)కు కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశాల తో గురువారం మరలా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందు లో సాలూరు మున్సి పాలిటీలోని మూడు దుకాణాలకు వార్షిక రిటైల్ పన్ను కింద ఒక్కోదానికి రూ.60.50 లక్షల చొప్పున, పర్నిట్ రూం పన్నుగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన దుకాణాలకు వార్షిక రిటైల్ పన్నుగా ఒక్కో దానికి రూ.71.50 లక్ష లు, పర్మిట్ రూం కోసం రూ.7.50 లక్షలు చెల్లించా ల్సి ఉంటుంది. ఇదే రోజు నుంచి దరఖాస్తులను కూడా తీసుకుంటున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్స జ్ అధికారి కె.సహదేవ తెలిపారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల్లోగా దరఖా స్తు చేసుకునేందుకు గడువు ఉందని, అదే నెల 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 5వ తేదీన పార్వతీపు రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియలో ఎంపిక చేస్తారని వివరించారు.


