చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలి

సీతంపేట: తుఫాన్‌ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పడిపోయిన చెట్లను వేగవంతంగా తొలగించే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సూచించారు. వైటీసీలో తుఫాన్‌ సహాయక చర్యలపై అఽధికారులతో గురువారం చర్చించారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు.

అనంతరం వైటీసీలో ఉన్న గర్భిణుల వసతిగృహాన్ని సందర్శించారు. అక్కడ వారికి అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. వారికి పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, మండల ప్రత్యేకాధికారి ధర్మరాజు, ఎంపీడీవో మిశ్రో తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement