2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

పార్వతీపురం: గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. 2026–27 సీజన్‌కు సంబంఽధించి రైతు కు ఇబ్బందులు లేకుండా రైతులు–మిల్లుల మ్యా పింగ్‌ను ముందుగానే పూర్తిచేయాలని సూచించా రు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి మాట్లాడుతూ జిల్లాలో 180 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందు కు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రైతు రిజిస్ట్రేషన్‌ కోసం వాట్సాప్‌ నంబర్‌ 733735 9375పై అవగాహన కల్పించాలని, ఈ–పంట నమోదు, గన్నీ సంచులు, వాహనాల రిజిస్ట్రేషన్‌–జీపీఎస్‌ ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

27న ప్రపంచ పర్యాటక దినోత్సవం

జిల్లాలో ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల్లో ప్ర త్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడంతోపా టు విద్యార్థులకు పర్యాటక అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ట్రావెల్‌ బ్లాగర్లు, సోషల్‌ మీడియా ఇన్ఫ్ల్లూయెన్సర్లు, కంటెంట్‌ క్రియేటర్లు, ప్రజలు పా ల్గొనాలని కోరారు. పర్యాటక ప్రాంతాలపై తీసిన ఫొటోలను, వీడియోలను జీ మెయిల్‌ద్వారా డీటీఓ.ఏపీటీఏపీపీపీఎంకు, వాట్సాప్‌ నంబర్‌ 91001 09162కు పంపి పోటీలలో పాల్గొనవచ్చునని తెలి పారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement