పార్వతీపురం రూరల్: తనపై కొందరు కావాలనే బురదజల్లుతు న్నారని, తాను పార్టీ మారుతున్నట్లు జరు గుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న విష ప్ర చారాన్ని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. గత ప్రభుత్వంలో తనకు సముచిత స్థానం కల్పించి, శాసనసభ్యుడిగా ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి నేటి కీ, ఏనాటికీ విధేయుడిగానే ఉంటానన్నారు. పార్టీ శ్రేణుల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి, పార్టీ జెండాను ఎగురవేస్తామని జోగారావు ధీమా వ్యక్తం చేశారు.
పార్వతీపురం రూరల్: ‘వికసిత్ భారత్–2047’ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీ లు నిర్వహించనున్నట్లు డీఈఓ బ్రహ్మాజీరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10 వరకు జరిగే డ్రాయింగ్, వక్తృత్వ పోటీల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ప్రజా సేవ, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్యాలపై విద్యా ర్థుల్లో అవగాహన, సృజనాత్మకత పెంచడమే ఈ పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు.
పార్వతీపురం రూరల్: సర్కారు బడుల రూపురేఖలు మార్చి, కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే ‘బడికోసం’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మన్యం కళావేదికలో శుక్రవా రం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాతలు, ప్రజా భాగస్వామ్యంతో బడుల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్యను పెంపొందించేందుకు త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువస్తామ ని వెల్లడించారు. ఆంగ్లం, హిందీ, తెలుగు, గణి త సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టుసాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాల జాబితా సమర్పిస్తే నిధులను బట్టి మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ పి.బ్రహ్మాజీరా వు, అధికారులు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
సీతానగరం: దీర్ఘకాలంగా ఉపాధి కోల్పోయిన ఎన్‌సీఎస్‌లో పనిచేసే కూలీలను కాదని కర్మా గారంలో క్లీనింగ్ కోసం విజయనగరం జిల్లా గుర్ల మండలం నుంచి కూలీలను రప్పించడా న్ని స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేశా రు. స్థానికంగా కూలీలకు ఉపాధి కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించడంపై యాజమాన్య ప్రతినిధులను నిలదీశా రు. తక్షణమే 12 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ నాయకులు సతీష్, వెంగళరావు డిమాండ్ చేశారు. కూలీల ఆందోళన సమాచా రం అందుకున్న ఎస్‌ఐ ఎం.హేమలత కర్మాగా రం వద్దకు చేరుకున్నారు. స్థానికులకు పనికల్పించేలా చూడాలని యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణిగింది.


