పార్వతీపురం రూరల్: ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047–ప్రతిపాదనలు, సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం పార్వతీపురంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగిన విజ్ఞాన సదస్సులో వివిధ మండలాల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు, అణు, జల, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం తదితర అంశాలపై వారు చేసిన విశ్లేషణలు, శాసీ్త్ర య ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. జ్యూరీ సభ్యు ల నిశిత మూల్యాంకనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జియ్యమ్మవలస మండలం బీజే పురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ఎం.లీలాగౌతమ్ (10వ తరగతి ), కురుపాం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎం.శ్రావ్యశ్రీ (9వ తరగతి) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ పోటీలకు అర్హత సాధించారు. వీరికి డీఈ ఓ పి.బ్రహ్మాజీరావు ప్రశంసాపత్రాలను అందజేశా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామయ్య, ఎంఈఓ లు కె.ప్రసాదరావు, సామల సింహాచలం, ఎన్‌జీసీ కో–ఆర్డినేటర్ జి.రాజు, నోడల్ సైన్స్ టీచర్లు శైలజ, సంతోష్, గైడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


