పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం నడిబొడ్డున వైఎస్సార్ కూడలి మలుపు వద్ద మూగజీవాల లోడుతో వెళ్తున్న ఓ భారీ వాహనం ఇంజిన్ మరమ్మతులతో నిలిచిపోయింది. ఒక మనిషి, కనీసం సైకి ల్ కూడా వెళ్లేందుకు వీల్లేనంత అడ్డంగా వాహనం నిలిచిపోవడంతో వైఎస్సార్ కూడలి నుంచి బైపాస్ రోడ్డు చివరి వరకు, అటు కాంప్లెక్స్ నుంచి శివారు ప్రాంతాల వరకు నాలుగు మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు మూడు గంట ల పాటు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేసీబీ సాయంతో అతికష్టం మీద వాహనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (ఆర్‌సీఎం స్కూల్) వద్దకు నెట్టడంతో ట్రాఫిక్ సమస్య తొలగింది.


