ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్‌సీ కమిషన్ నియమించాలని ఏపీజేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద జేఏసీ జిల్లా చైర్మన్ గొట్టాపు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసనలో భాగంగా గురువారం ‘హ్యాండ్ టు హ్యాండ్’ నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డీజీ ప్రసాదరావు, జేఏసీ ప్రతినిధులు ఆర్‌వీ రమణమూర్తి, పీఏఎల్ కుమార్, వివిధ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– పార్వతీపురం రూరల్


