పార్వతీపురం: జిల్లాలో వ్యాపార ఔత్సాహికులకు, రైతులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలను మరింత విస్తరింపజేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో త్రైమాసికానికి సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలన్నారు. ఎస్‌ఈఆర్‌పీ, ఎంఈపీఎంఏ, డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖల సమన్వయంతో యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, ఆర్.వైశాలి, పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
రెండు నెలల్లో ఆర్‌ఎస్‌ఈటీఐ
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ బీఐ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌ఎస్‌ఈటీఐ)ఏర్పాటు చేసి రెండు నెలల్లో శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీపీఎల్ కుటుంబాలకు చెందిన యువతకు ఉచిత నివాస శిక్షణతో పాటు చేతి వృత్తు లు, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, మొబైల్ రిపేరింగ్, చిన్న వ్యాపారాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడం జరు గుతుందన్నారు. అర్హులైన వారు జిల్లా, మండల ఆర్‌ఎస్‌ఈటీఐ కేంద్రాన్ని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ గ్రామాలు సాధ్యమని అన్నారు. గ్రామా ల్లో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వ్యర్ధాల నిర్వహణపై జూమ్ ద్వారా గురువారం సమీక్షించారు.
వ్యవసాయ ఖర్చులు తగ్గించాలి
వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి రైతు ల ఆదాయాన్ని పెంచేలా అధికారులు కృషి చేయా లని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. అబాసి కార్యక్రమంలో భాగంగా వర్చువల్ వీడి యో ద్వారా వ్యవసాయ క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహి స్తూ ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గట్టుమీద చెట్టు ద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రతీ గట్టుపై మొక్క లు నాటాలని, వరి పొలాల్లో ఎౖత్త్తైన గట్లపై పామాయిల్ సాగు చేపట్టాలని తెలిపారు. నీటి వసతి ఉన్న భూముల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు ల విజయగాధలను ‘మన్యం రైతు’ చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకరరావు పాల్గొన్నారు.
1.27 లక్షల నోటీసుల జారీ పూర్తి
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా 1,27,068 నోటీసుల పంపిణీ శతశాతం పూర్తయ్యిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఇంతవరకు 1,03,400 విచారణలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సర్ ప్రక్రియ గడువు సెప్టెంబర్ 10 వరకు ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు విచారణ తేదీల్లో పాల్గొ ని వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.హేమలత పాల్గొన్నారు.
గురు పూజోత్సవం రేపు
పార్వతీపురం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి గురు పూజో త్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం తెలిపారు. నర్సిపురంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి అవార్డులను అందజేయనున్నట్టు తెలిపారు.


