ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఎంపీఎఫ్‌సీ గొడౌన్లు సిద్ధం 35 రకాల నిత్యావసరాలకు జీసీసీ టెండర్లు

సీతంపేట: ఐదో విడతలో సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగులు సీట్ల ప్రవేశాలకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ మూటక గోపాలకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకు ని ఏదైనా ఐటీఐలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. అదే తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ స్థానిక ఐటీఐలో ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌ జరిపిన తరువాత మిగిలి ఉన్న సీట్లలో 10 శాతం మెరిట్‌ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ కోటాలో తీసుకోనున్నట్టు తెలిపారు. వివరాలకు 7569062449, 9491134464 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

పార్వతీపురం: రైతులకు పంటల నిల్వ సౌక ర్యం కల్పించేందుకు నిర్మిస్తున్న ఎంపీఎఫ్‌సీ (బహుళ ప్రయోజన సదుపాయాల కేంద్రం) గొడౌన్లను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గొడౌన్లు, మౌలిక వసతుల కల్పనపై సహకార శాఖ, వివిధ శాఖల అధికారులతో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐఎఫ్‌ (అగ్రి కల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్‌ ఫండ్‌) పథకం కింద జిల్లాలో మొదటి దశలో మంజూరైన 20 గొడౌ న్లలో 15 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపా రు. పూర్తయిన గొడౌన్లకు విద్యుత్‌, నీరు, ఇతర మౌలిక వసతులను వెంటనే కల్పించాలని సూచించారు. మిగిలిన గొడౌన్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా సహకార అధికారులు, పీఏసీఎస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

సీతంపేట: ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి స్థానిక ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జీసీసీ ఆధ్వర్యంలో గురువారం టెండర్లు నిర్వహించారు. కంది పప్పు,మినపపప్పు, శనగపప్పు, పెసరపప్పు, వంటనూనె, ఇడ్లీ రవ్వ, బన్సీ రవ్వ, మైదా, గోధుమపిండి తదితర 35 రకాల వస్తువులతో పాటు కాస్మోటిక్‌లకు టెండర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ జి.చిన్నబాబు మాట్లాడుతూ సకాలంలో నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, జీసీసీ డీఎం డి. కృష్ణ, మేనేజర్‌ గొర్లె నరసింహులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement