–8లో
కంచేరులో భూ వివాదం!
భూ వివాదం నేపథ్యంలో భోగాపురం మండలం కంచేరు రెవెన్యూ పరిధిలో భూహక్కు దారులు ఆందోళనకు దిగారు.
పార్వతీపురం రూరల్ : ‘అబాసి’ పేరుతో జిల్లాలో ఉపాధ్యాయులపై వర్చువల్ నిఘా పెంచడం తగదని యూటీఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణకు తీసుకొచ్చి న ఈ డిజిటల్ విధానంపై యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు, జిల్లా నేతలు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు అసంతృప్తి వ్యక్తం చేశా రు. ‘ముస్తాబు’ పేరుతో ఇప్పటికే బోధనేతర పను ల బరువు మోస్తున్న పంతుళ్లకు, ఇప్పుడు ఇతర శా ఖల అధికారుల పర్యవేక్షణ అశనిపాతంగా మారిందన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకునే చర్యలు వికటించకూడదని వారు హితవు పలికారు. ఓ వైపు ‘ఫేషియల్ అటెండెన్స్’ అమల్లో ఉండగా, మళ్లీ గుంపుగా నిలబడి గ్రూప్ ఫొటోలు తీసి పంపమనడం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అకడ మిక్ క్యాలెండర్‌ను అనుసరిస్తూనే, జిల్లా యంత్రాంగం అప్పగించే అదనపు కార్యక్రమాలు అమలు చేయడం కత్తిమీద సాములా మారిందని స్పష్టంచేశారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులను నిరంతరం ఒత్తిడికి గురిచేయడం సరికాదని, వెంటనే కలెక్టర్ స్పందించి ఈ వర్చువల్ పర్యవేక్షణ విధానాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశా రు. లేకుంటే జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి, పెద్దఎత్తున ఆందోళన బాట పడతామని వారు హెచ్చరించారు.


