ముగిసిన నైపుణ్యాభివృద్ధ్ధి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నైపుణ్యాభివృద్ధ్ధి శిక్షణ

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

విజయనగరం అర్బన్‌: స్థానిక మహారాజా కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో ఇంటర్నల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ సెల్‌ సహకారంతో ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బందికి ‘ప్రయోగశాల విధానాలు, భద్రత, దసీ్త్రకరణ, నాణ్యతా వ్యవస్థలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రామయ్య మాట్లాడుతూ.. ప్రయోగశాలల్లో భద్రతా ప్రమాణాలు, నాణ్యతా విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులను పక్కాగా అమలు చేయడం వల్ల పనితీరు, విశ్వసనీయత పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎంఎస్‌ లాబొరేటరీస్‌ క్వాలిటీ కంట్రోల్‌ హెడ్‌ కె.లీలాకిరణ్‌కుమార్‌, ఎంఐఎంఎస్‌ క్వాలిటీ అక్రిడిటేషన్‌ కో ఆర్డినేటర్‌ జె.విజయ్‌కుమార్‌ పాల్గొని ప్రయోగశాల నిర్వహణ, భద్రతపై దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ల్యాబ్‌ సెక్యూరిటీ, రసాయనాల సురక్షిత నిల్వ, పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, జీవ భద్రత, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం వంటి ప్రమాదాల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రయోగశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement