కూటమి కుట్ర? | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్ర?

Aug 8 2026 12:41 AM | Updated on Aug 8 2026 12:41 AM

పది నిమిషాల ఆలస్యం.. రెండు గంటల నిరీక్షణ! మన్యం బంద్‌కు ఆర్టీసీ సహకరించాలి

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బంద్‌ విచ్ఛిన్నానికి..

బంద్‌ రోజునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు

ఆదివాసీ దినోత్సవం తేదీ మార్పుపై గిరిజన సంఘాల ఆగ్రహం

11న సీతంపేట ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవం

సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడికి మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో 9వ తేదీకి బదులు 11న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, గిరిజనసంఘాలు, గిరిజన ప్రజలు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఇకపై సోమవారమే పీజీఆర్‌ఎస్‌

సీతంపేట: ఇకపై ప్రతి సోమవారం మాత్రమే ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వారంలో ప్రతి శుక్రవారం, సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించేవారమని ఇకపై వారంలో సోమవారం ఒకరోజు మాత్రమే ఉంటుందన్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇన్‌చార్జ్‌ పీఓ అందుబాటులో ఉంటారని, గిరిజనులు తమ సమస్యలను వినతుల రూపంలో విన్నవించుకోవచ్చన్నారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు వీలుగా మార్పు చేశామని గమనించాలని కోరారు.

పార్వతీపురం రూరల్‌: మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. అధికారుల సమీక్షా సమావేశానికి పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో, ఏకంగా రెండు గంటల పాటు ఆఫీసు బయట వరండాలో నేలపై కూర్చుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాసరాజు, డీపీహెచ్‌ఓ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, సిబ్బంది మధ్యాహ్నం 2:10 నుంచి 2:15 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకునే సరికి అధికారులు సమావేశం ప్రారంభించి తలుపులు మూసివేశారు. దీంతో అడ్మిన్‌, హెల్త్‌, ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన సుమారు 35 మంది సెక్రటరీలు లోపలికి వెళ్లలేక బయటే ఉండిపోయారు. అసలు ఆ సమావేశం ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టతలేని సిబ్బంది.. సాయంత్రం నాలుగు గంటల వరకు వరండాలోనే వేచిచూశారు. లోపల ఉన్న అధికారులు డోర్లు తీయకపోవడం, కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో చేసేది లేక నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: జీవో–3 పరిరక్షణ, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం అమలుకు మద్దతుగా ఆగస్టు 8న పిలుపునిచ్చిన మన్యం బంద్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఏటా ఆగస్టు 9న నిర్వహించే అంతర్జాతీయ ఆది వాసీ దినోత్సవాన్ని ఈసారి ఒక రోజు ముందుగా.. అంటే 8న నిర్వహించాలని నిర్ణయించడంపై ఆదివాసీ, గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆగస్టు 9నే ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన సంఘాలు ముందురోజు ఐటీడీఏ వద్దనున్న అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం వంటివి చేస్తుంటారు. మరుసటి రోజు అధికారిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. ఈసారి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన తేదీని మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి తీరును దుయ్యబడుతున్నాయి.

అదే రోజున మన్యం బంద్‌కు పిలుపు

ఆగస్టు 8న మన్యం బంద్‌కు పిలుపునివ్వడంతో,

రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ శనివారం నిర్వహిస్తున్నందున ఆర్టీసీ అధికారులు సహకరించాలని ఆదివాసీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాల నాయకులు రామస్వామి, రంజిత్‌ కుమార్‌, బలరాం, బి.వి.రమణ, గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు తదితరులు కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనకారులు బస్‌ సర్వీసులను నిలువరించక ముందే బస్సులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మణరావును కలిసి వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి ఏజెన్సీ బంద్‌ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అధికారిక కార్యక్రమాలకు గిరిజనులను, సంఘాలను తరలించి బంద్‌ ప్రభావాన్ని తగ్గించాలనే ప్రయత్నమేనని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరో పిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే తేదీ మార్పు చేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని సంఘాల నాయకులు చెబుతున్నారు.

బంద్‌ను బలహీనం చేసే వ్యూహమా..?

కూటమి నేతలు గత ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీనే అమలు చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీనికితోడు జీవో 3పై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూటకో ప్రకటన చేస్తూ మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే జీవో–3, గిరిజన భూ హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న మన్యం బంద్‌కు స్పందన లేదనే భావన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని గిరిజన, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బంద్‌ రోజునే ప్రభు త్వ ఆధ్వర్యంలో భారీగా గిరిజన ఉత్సవాలు నిర్వహించి ఉద్యమ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నాయి. జీవో–3లో

మంత్రిని ప్రశ్నిస్తూ మన్యం వెలసిన పోస్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement