‘మా కడుపు కొట్టి, ఆదివాసీ ఉత్సవాలు నిర్వహించేందుకు మనసు ఎలా వస్తుందని వైటీసీ గిరిజన గర్భిణి వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు వాపోయారు. ఏళ్లతరబడి అందిస్తున్న తమను తొలగించడంతో రోడ్డున పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద శుక్రవారం ఉదయం నుంచి రాత్రివరకు నిరసన తెలిపారు. వర్షం కురుస్తున్నా అక్కడే బైఠాయించారు. 20 నెలలుగా బకాయి జీతాలు ఇవ్వలేదని వాపోయారు. దీనిపై పీఓ వైశాలి స్పందిస్తూ ఏఎన్‌ఎంలతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


