పారాది వేగావతి నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేపై నిరంతరం ట్రాఫిక్‌జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మరమ్మతులకు గురైన పాత బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తాత్కాలిక కాజ్‌వేపై నుంచే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పొరపాటున కాజ్‌వేపై ఒక్క వాహనం నిలిచిపోయినా, నదిలో నీటి ప్రవాహం పెరిగినా ట్రాఫిక్ జామ్ అవుతోంది. శుక్రవారం దాదాపు రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
– బొబ్బిలి రూరల్


