పార్వతీపురం రూరల్: చట్టాలపై అవగాహన కల్పించి, యువతను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు అక్షర సమరానికి శ్రీకారం చుట్టారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ’మీ పోలీస్–మీకు తెలుసా?’ పేరిట ఈ నెల 9న విద్యార్థులకు నిర్వహించనున్న ప్రత్యేక పరీక్ష ప్రచార పోస్టర్‌ను ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సైబర్ నేరా లు, గంజాయి కట్టడి, రహదారి భద్రత, మహిళా రక్షణ, పోలీసుల విధులపై విద్యార్థుల పరిజ్ఞానా న్ని ఈ పరీక్ష అంచనా వేస్తుంది. విద్యార్థి దశలోనే మంచిచెడుల విచక్షణ అలవడుతుందని, యువత సృజనాత్మకంగా ఆలోచిస్తేనే సురక్షిత సమాజం సాధ్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష జరుగుతుంది. 21 ఏళ్లలోపు విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు పట్టణ పోలీసుల వద్ద కానీ, పరీక్షకు గంట ముందు కేంద్రం వద్ద కానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 30 నిమిషాల వ్యవధిలో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి డ్రాప్ బాక్స్‌లో వేయాలి. విజేతలైన మొదటి ముగ్గురికి ఎస్పీ చేతులమీదుగా బహుమతులు, పాల్గొన్న వారందరికీ ఆన్‌లైన్ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, జీఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


