వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు

Mar 14 2026 7:36 AM | Updated on Mar 14 2026 7:36 AM

బొండపల్లి: వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు ఏపీసీఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఫారెస్టు ) అధికారి రాహుల్‌ పాండే తెలిపారు. మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వనమిత్ర కేంద్రాల్లో ప్రసుత్తం ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు వసతులు కల్పించడానికి పరిశీలించి సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అందాల్సిన వేతన బకాయిలకు సంబంధించి నివేదికలను కూడా పంపనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎఫ్‌ఓ రవీంద్ర దామో, ఎఫ్‌ఆర్‌ఓ సింధు, వనమిత్ర కేంద్రం సహాయకుడు పడాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement