అన్ని బాధ్యతలూ ఆయనపైనే..
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్‌రెడ్డిపై అదనపు భారం పడుతోంది. రోజురోజుకూ ఆయన విధులు, చూడాల్సిన బాధ్య తలు ఎక్కువవుతున్నాయి. జిల్లా పరిపాలనలో కలెక్టర్ తర్వాత, సంయుక్త కలెక్టర్ కీలకం. రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, సర్వే వంటి కీలక విభాగాల పర్యవేక్షణ ఆయనదే. ప్రస్తుతం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వెళ్లారు. రెండు రోజులపాటు ఆయన సమావేశాల్లో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జేసీనే కలెక్టర్ బాధ్యతలనూ చూడాల్సి వ స్తోంది. ఇదే సమయంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓగా యశ్వంత్‌కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సబ్ కలెక్టర్ డిపార్ట్‌మెంట్ పరీక్షల నిమిత్తం వెళ్లడంతో ఆ బాధ్యతలవైపూ దృష్టి పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో భాగంగా పార్వతీపు రం మున్సిపాలిటీ బాధ్యతలనూ జేసీకే అప్పగించా రు. ఇటు సమీక్షలు, అటు తనిఖీలంటూ ఆయనకు క్షణం కూడా తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి పెద్ద దిక్కుగా ఆయనే అన్ని పనులనూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


