గ్యాస్‌ కొరత వస్తే హోటల్‌ రంగం కుదేలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత వస్తే హోటల్‌ రంగం కుదేలు

Mar 14 2026 8:00 AM | Updated on Mar 14 2026 8:00 AM

కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే...

ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌

విజయనగరం: పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధసంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్‌ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌ కోరారు. విజయనగరం జిల్లా హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. వాసుతో కలిసి నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్‌ కొరతను దష్టిలో పెట్టుకుని పది రోజులు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అసోసియేషన్‌ తరఫున అందజేశామన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేదని చెబుతు న్నా, వాస్తవానికి తమ హోటల్స్‌కు తగినంత గ్యాస్‌ సరఫరా కావడం లేదన్నారు. సరఫరాపై గ్యాస్‌ డీలర్లు చేతులెత్తేశారని వివరించారు. ఇదే పరిస్థితి కొన్నిరోజులు కొనసాగితే హోటల్స్‌, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉందన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు. గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పి.వాసు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో అనేకమంది అద్దె భవనాలలో హోటల్స్‌ నిర్వహిస్తున్నారని, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యలు వినియోగించేందుకు భవన యజమానులు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ పరి స్థితి కొనసాగితే హోటల్స్‌ నడపడం సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఒంగోలు పట్టణంలో అన్ని జిల్లాల అసోసియేషన్‌లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తగిన నిర్ణ యం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్‌, టి.అనిల్‌, జిల్లా అసోసి యేషన్‌ కార్యదర్శి కాళ్ల సునీల్‌ కుమార్‌పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement