పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం

Mar 14 2026 8:00 AM | Updated on Mar 14 2026 8:00 AM

పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం

విజయనగరం రూరల్‌: మెటలర్జీ విభాగం విద్యార్థులకు పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని మెటలర్జీ విభాగం పరిశోధకుడు డాక్టర్‌ బి.శివకుమార్‌ అన్నారు. విజయనగరం జేఎన్‌టీయూ జీవీ లో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన ‘ఈఐఎన్‌ఈఎన్‌– 2026’ 11వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆధునిక పరిశ్రమల్లో మెటలర్జీ ప్రాముఖ్యత, మెటీరియల్‌ సైన్స్‌ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్‌ జి.వేణుగోపాల్‌నాయుడు బియాండ్‌ ది డిగ్రీ అంశంపై ప్రేరణాత్మకంగా వివరించారు. డిగ్రీకి మించి నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేశారు. అనంతరం అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సత్కరించారు. సదస్సు చైర్మన్‌ కె.శ్రీనివాస ప్రసాద్‌, వర్సిటీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కెసీబీ రావు, వివిధ కళాశాల ఆచార్యు లు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement