బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా

Mar 14 2026 8:00 AM | Updated on Mar 14 2026 8:00 AM

బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా మర్యాదపూర్వక కలయిక నేరడి బ్యారేజ్‌ వద్ద ఏనుగుల సంచారం అప్పుల బాధ తట్టుకోలేక రైతు మృతి ఆ డీలర్‌ మాకొద్దు

కురుపాం: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు శాసన సభ మాజీ సభ్యుడు నిమ్మక జయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పరిస్థితు లు, వ్వక్తిగత కారణా ల దృష్ణ్యా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించామన్నారు.

విజయనగరం: వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నూతనంగా నియామకమైనవారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకులుగా నియమితులైన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా పరిశీలకురాలు శోభా హైమావతి పూలమొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరికీ మజ్జి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టు గా కృషి చేయాలని ఆకాంక్షించారు.

భామిని: మండలంలో నేరడి–బి నుంచి నాలుగు ఏనుగుల గుంపు నేరడి–బ్యారేజ్‌ వైపు శుక్రవారం వెళ్లాయి. కాట్రగడ, నేరడి రైతులు సాగుచేసిన మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం కలిగిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల మళ్లింపులనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన రైతు కురుమునెల్లి దాలినాయుడు (33) పురుగులు మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే... దాలినాయుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇటీవల కాలంలో పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండ గా శుక్రవారం మృతి చెందాడు. గుర్ల పోలీసు లు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీలవేణి, కుమార్తెలు ఉష, ఝాన్సీ ఉన్నారు.

రాజాం: కొత్తవలస గ్రామంలో రేషన్‌ డిపో డీలర్‌పై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్‌ను తొలగించాలంటూ గ్రామానికి చెందిన 200 మంది రేషన్‌ లబ్ధిదారులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. డీలర్‌ ఆగడాలను తహసీల్దార్‌ ఎం.రాజశేఖరానికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement