పూసపాటిరేగ: భోగాపురం మండల పరిధిలో అనధికార మద్యం విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ వి.రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలు.. మండలంలోని పోలిపల్లి గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక మహిళ నుంచి 180 ఎం.ఎల్. పరిమాణం కలిగిన ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, ప్రతాప్, కానిస్టేబుల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఒకరి అరెస్టు


