అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Aug 19 2025 4:42 AM | Updated on Aug 19 2025 4:42 AM

అప్రమ

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి ‘అక్షరాంధ్ర’పక్కాగా చేపట్టాలి ● కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ సస్యరక్షణే ప్రధానం

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎ. శ్యామ్‌ప్రసాద్‌ కోరారు. వర్షాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాల ని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై తన కార్యాలయంలో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. నీటి ప్రవా హం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉపకలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీ ఏ పీడీ ఎం.సుధారాణి, ఇతర జిల్లా అధికారు లు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరక్ష్యరాస్యులైన వారికి అక్షర జ్ఞానం కలిగించి ఫైనాన్సియల్‌, డిజిటల్‌ లిటరీసీపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లాలో 57 శాతం అక్షరాస్యత ఉందని, నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ఏడాది 65,011 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్టు వెల్లడించారు. వయోజన విద్య కింద సాయంత్రం, లేదంటే రాత్రివేళల్లో ప్రతిరోజు ఒక గంట సమయం వారికి అక్షరజ్ఞానం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సవ్యవంగా సాగేలా డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా, ఐసీడీఎస్‌ సిబ్బంది బాధ్యత వహించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతీశాఖలో పీజీఆర్‌ఎస్‌ కోసం నియమించబడిన వారు రెండు వారాల పాటు కలెక్టరేట్‌లో శిక్షణ పొందాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. హేమలత, ఎస్‌డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్‌.దిలీప్‌చక్రవర్తి, డీఆర్‌డీఏ డ్వామా, ఐసీడీఎస్‌ పీడీలు ఎం. సుధారాణి, కె.రామచంద్రరా వు, పి. కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నీటి ముంపునకు గురైన వరి పంటను చిన్నచిన్న జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని కురుపాం మండలం రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం) ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ ఎస్‌.కె.ద్రువ అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎస్‌.స్రవంతి, ఎస్‌.శ్రీనివాసరాజు, ఉమాజ్యోతితో కలిసి జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడు వలస, గరుగుబిల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. పొలంలో ముంపు నీటిని వీలైనంత త్వరగా మళ్లించాలని, అనంతరం ఎకరాకు 20 కిలోల యూరియా, 10–15 కిలోల పోటాష్‌ ఎరువును పై పాటుగా వేయా లని సూచించారు. వీరి వెంట గరుగుబిల్లి వ్యవసాయాధికారి విజయభారతి ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి 1
1/1

అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement