
కొత్తవలసను ముంచెత్తిన వాన
కొత్తవలస : మండలంలోని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇంత పెద్ద వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానికులు పేర్కొన్నారు. ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కుండపోతగా కురవడంతో రైల్వే అండర్ బ్రిడ్జీలు, కొత్తవలస జంక్షన్ జలమయమమయ్యాయి. ముఖ్యంగా కొత్తవలస జంక్షన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. ఈ వరద నీటిని అరికట్టేందుకు ఇటీవల సుమారు రూ 3.కోట్లతో నిర్మించిన పై కప్పు నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలాగే కొత్తవలస – విజయనగరం, కొత్తవలస – విశాఖపట్నం రోడ్డు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్‌ను సైతం వర్షం నీరు ముంచేసింది.
జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జీలు
కొత్తవలస జంక్షన్ జలమయం

కొత్తవలసను ముంచెత్తిన వాన

కొత్తవలసను ముంచెత్తిన వాన