
ఎకై ్సజ్ అధికారులకు ప్రశంసాపత్రాలు
విజయనగరం టౌన్:
ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఎకై ్స జ్ అధికారులు, సిబ్బంది అమరావతిలో శుక్రవారం జరిగిన జెండాపండగలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. వారిలో విజయనగరం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు, సూపరింటెండెంట్ జీవన్ కిశోర్, రాజాం హౌస్ ఆఫీసర్ ఆర్.జైభీమ్, విజయనగరం ఎకై ్సజ్ ఎస్‌ఐ సీహెచ్ రాజశ్రీ, నెల్లిమర్ల కానిస్టేబుల్ సీహెచ్.సంతోష్ పార్వతీపురం టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ పి.పావని ఉన్నారు. వీరికి జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.